![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -101 లో..... రామరాజు కుటుంబం భాగ్యం ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. ఒకతను భాగ్యం ఇంటిని చూపిస్తాడు. లోపలికి వెళ్ళబోతుంటే భాగ్యం పిలిచి అక్కడి ఎటు వెళ్తున్నారు.. ఇటు మా ఇల్లు అని భాగ్యం పిలుస్తుంది. అతను ఎవరో మీకు తప్పుడు అడ్రెస్ చెప్పాడని భాగ్యం అందరిని తన వెంట తీసుకొని వెళ్తుంది. భాగ్యం శ్రీవల్లి వాళ్ళకి సైగ చేస్తుంది. అమ్మ ఏదో ప్లాన్ చేసినట్లుంది మనం రెడీ అయి వెళదామని శ్రీవల్లి తన చెల్లి నాన్నతో అంటుంది. ధీరజ్ తన ఫ్రెండ్ తో నాకు జాబ్ చూడమని చెప్తాడు.
రామరాజు కుటుంబం భాగ్యంతో వెళ్తారు. అక్కడ ఇంటికి చూసి ఆశ్చర్యపోతారు. నిజం గా ఇది మీ ఇళ్లేనా అని తిరుపతి అడుగుతాడు. లేదండి రెంట్ కి తీసుకున్నామని భాగ్యం అంటుంది. మరేంటి ఇలాంటివి మూడు ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా అని భాగ్యం అంటుంది. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్లి మాట్లాడుకుంటారు.. మీరేం చదువుకున్నారని శ్రీవల్లిని అడుగుతుంది నర్మద. శ్రీవల్లి చెప్పకుండా తన చెల్లి సమాధానం చెప్తుంది. అదేంటి నువ్వు చెప్తున్నావని నర్మద అనగానే పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావ్ కదా అలాంటివేం తెలియదు నీకు అని నర్మదని భాగ్యం అంటుంది. తను అన్నదాంట్లో తప్పేంటి తనని ఇంకొకసారి అలా అనకు అని భాగ్యంతో వేదవతి అంటుంది. నేనేదో సరదాకి అన్నానని భాగ్యం అంటుంది.
ఆ తర్వాత చందు, శ్రీవల్లిలు పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. శ్రీవల్లి చందుని ఇంప్రెస్ చేస్తుంది. మీరు ఎవరైనైనా ప్రేమించారా ప్రేమించే ఉంటారులే అందంగా ఉన్నారు కదా అని శ్రీవల్లి అంటుంది. అయిన నేనేం పట్టించుకోను మీతో నా భవిష్యత్తు ముఖ్యమని శ్రీవల్లి అంటుంది. మీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయని భాగ్యం వల్ల భర్తని రామరాజు అడుగుతాడు. ఎక్కడ జనాలు ఉంటే అక్కడ ఇడ్లీ దోశ అని అతను అనగానే.. రామరాజుకి ఏం అర్ధం కాదు. తరువాయి భాగంలో ప్రేమ కాఫీ షాప్ లో జాబ్ చేస్తుంది. ఆ విషయం ధీరజ్ కీ తెలిసి వద్దని అంటాడు. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించినదని చేస్తానని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |